న్యూఢిల్లీ : దీపావళి పండుగ సందర్బంగా తమ సంస్థలో ప్రయాణించే వారికి ప్రత్యేక భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆకాశ ఎయిర్ తెలిపింది. ఆకాశ ఎయిర్ ఆన్బోర్డ్ మీల్ సర్వీస్ అయిన కేఫ్ ఆకాశ 'దీపావళి స్పెషల్ మీల్'ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. నవంబర్ చివరి వరకు సాంప్రదాయ మటర్ కే చోలే, మూంగ్ దాల్ కచోరీ, మోతీచూర్ లడ్డు, తమకిష్టమైన పానీయాల ఎంపికలతో కూడిన రుచులను అస్వాదించవచ్చని పేర్కొంది.