ముంబయి : టాటా మోటార్స్ తన కొత్త హారియర్, సఫారీ మోడళ్ల కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించింది. అత్యాధునిక సాంకేతికత, సాటిలేని భద్రతా ఫీచర్లు, వినూత్నతతో అందుబాటులోకి తెచ్చిన కొత్త హారియర్, సఫారీలు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చినట్లు పేర్కొంది. వినియోగదారులు తాము ఎంపిక చేసుకున్న ఎస్‌యువిలను అన్ని అధీకృత తమ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ వెబ్సైట్లో కేవలం రూ.25,000 లతో బుక్ చేసుకోవచ్చని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండి శైలేష్ చంద్ర పేర్కొన్నారు.