న్యూయార్క్ : ఆన్లైన్ చాట్ వేదిక ఒమెగల్ మూత పడింది. దీంతో 14 ఏళ్ల ఆ సంస్థ ప్రస్థానానికి ముగింపు పలికినట్లయ్యింది. తమ వెబ్సైట్ను ఇక ఎంతోకాలం నడిపే ఆర్ధిక స్థోమత, మానసిక భారాన్ని తట్టుకునే సామర్థ్యం తమకు లేదని ఆ సంస్థ వ్యవస్ధాపకుడు లీఫ్ కే బ్రూక్స్ పేర్కొన్నారు. అపరిచితులు ఆన్లైన్ వేదికగా కలుసుకుని, కనెక్ట్ కావడానికి వీలుగా బ్రూక్స్ 18 ఏళ్ల వయస్సులోనే 2009లో దీన్ని రూపొందించడం విశేషం.