ముంబయి : ప్రస్తుత పండుగ సీజన్ సందర్బంగా నయారా ఎనర్జీ తమ వినియోగదారులకు ప్రత్యేక రివార్డులను అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం 'సబ్ కి జీత్ గ్యారెంటీడ్'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ క్యాంపెయిన్లో వినియోగదారులు రూ.200 కంటే ఎక్కువ పెట్రోల్ కొనుగోళ్లపై రూ.1,000 వరకు ఖచ్చితమైన వోచర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. వోచర్లతో పాటు కస్టమర్లు స్మార్ట్ఫోన్లు, 2 వీలర్ల నుండి కార్ల వరకు అనేక బహుమతులను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.