పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : చంద్రయాన్ 3 జాబిల్లిపై విజయంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆ శాస్త్రవేత్తల్లో పాలకొల్లు మండలం దగ్గులూరుకు చెందిన సిద్ధాని శ్రీనివాస్ కూడా ఉన్నారు. తండ్రి విశ్వేశ్వర రావు చేనేత కార్మికుడు. అయితే కొడుకు ఆధునిక సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకున్నారు. ప్రాధమిక విద్య దగ్గులూరు, కళాశాల విద్య పాలకొల్లులో సాగింది. గుడ్లవల్లేరులో బి.టెక్., హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.టెక్ పూర్తి చేసి శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేస్తున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పనిచేసేన వారిలో సిద్ధాని శ్రీనివాస్ ఒకరు. వీరి కృషికి, శాస్త్రవేత్తల బృందానికి ఇస్రో కి విజయం సాధించినందుకు యావత్ భారతావని, పలువురు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మువ్వన్నెల జెండా కీర్తి కిరీటాన్ని జాబిల్లి పై మోపిన చంద్రయాన్ 3 మరిన్ని విజయాల్ని మనకి అందించాలని, భవిష్యత్తు లో భారతదేశం ప్రపంచానికి తలమానికంగా నిలవాలని పలువురు ఆశించారు.