న్యూఢిల్లీ : చంద్రయాన్ -3 ద్వారా 70 కిలోమీటర్ల దూరం నుండి తీసిన చంద్రుని మరిన్ని ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో పోస్ట్ చేసింది. విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా (LHDA) ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషణ కొనసాగిస్తోంది. బుధవారం సాయంత్రం చంద్రునిపై అడుగుపెట్టనుంది.
'' మిషన్ షెడ్యూల్‌లో ఉంది. సిస్టమ్‌లు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయి. సున్నితమైన సెయిలింగ్ కొనసాగుతోంది. మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (ఎంఒఎక్స్) పూర్తి శక్తి , ఉత్సాహంతో పనిచేస్తుంది'' అని ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది.
మొదట ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్‌ల్యాండింగ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ఈ సమయంలో మార్పు చేశారు. 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడిపై దించాలని నిర్ణయించినట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.