ప్రజాశక్తి - ఉదయగిరి(నెల్లూరు జిల్లా) : మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి దగ్గర ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని అందరి ఐక్యతతో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకొచ్చుకుందాంమని కల్లూరి వెంకటేశ్వర్లు రెడ్డి మండల సర్పంచులు సంఘం అధ్యక్షులు శకునాలపల్లి సర్పంచ్ కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నాయకులకు, కార్యకర్తలు వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజన్న భక్తులకు, జగనన్న సైనికులు 2024 జరగబోయే ఎన్నికలలో మరల ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులుగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పై ఉన్నదన్నారు. గ్రామ, పంచాయతీ, మండల స్థాయిలో కొన్ని విభేదాలు, మనస్పర్తాలు ఉన్న అవి అన్నీ పక్కన పెట్టి మనమందరం కలసికట్టుగా మన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి 40 వేల ఓట్లతో గెలిపించుకుందాంమన్నారు. అనంతరం మండల పంచాయతీ ప్రజలకు అధికార్ల కు దసరా శుభాకాంక్షలు తెలిపారు.