Jul 30,2023 07:51

ఐస్‌లాండ్‌ ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో గల ఒక ద్వీపం. ఈ దేశం ఆగేయ ప్రాంతంలో మూడింట రెండొంతుల ప్రజలు నివసిస్తున్నారు. ఐరోపాలో జనసాంద్రత తక్కువగా ఉన్న దేశం ఇది. భౌగోళికంగా ఐస్‌లాండ్‌ అగ్నిపర్వతాలకు నిలయం. లావా ప్రాంతాలు ఉన్నాయి. ఈ ద్వీపకల్పంలో ప్రధానంగా ఇసుక, పర్వతాలు, మంచు ఖండాలు ఉన్నాయి. ఈ దేశం ఐరోపా ఖండంలోని ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో 1,03,000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఒక చిన్న ద్వీపం. 2009లో దీని జనాభా 3,20,000 మంది. దీని దేశ రాజధాని రిక్‌జావిక్‌. ఇక్కడ భూగర్భ వేడి నీటి నుండి విద్యుత్‌ను ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్నారు. మంచు ఖండాల నుంచి వచ్చే నదులు కూడా నిత్యం ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల గుండా సముద్రంలో సంగమిస్తాయి. గల్ఫ్‌ జలప్రవాహాలు ఐస్‌లాండ్‌ను వెచ్చగా ఉంచుతాయి. ఆర్కిటిక్‌ సర్కిల్‌ సమీపంలోనే ఉన్నత భూప్రాంతంగా ఉన్నందున వాతావరణం ఆహ్లాదంగా, సముద్రతీర ప్రాంతంగా ఉన్నందున వేసవికాలం చల్లగా ఉంటుంది. ద్వీప సమూహంలో అధికభాగం చల్లని వాతావరణం కలిగి ఉంటుంది. ఇది ధనిక దేశం. అందరూ ధనికులే. ఈ దేశ వాసుల తలసరి ఆదాయం ప్రపంచంలో నాల్గో స్థానంలో ఉంది. ఒకప్పుడు చేపలు పట్టడం ద్వారా 80 శాతం ఆదాయాన్ని సంపాదించేవారు. ఇప్పుడు ఇది 40 శాతానికి తగ్గింది. క్రమంగా ఇప్పుడు ఇతర పారిశ్రామికోత్పత్తులు కూడా కొనసాగుతున్నాయి.

2

 

3

 

3

 

4