రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కీలక నివేదిక బయటకు వచ్చింది. జైలు అధికారులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా వైద్యుల నివేదిక ఉంది. చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపు తదితర శరీరభాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలర్జీ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈనెల 12న సాయంత్రం 4.30గంటలకు జీజీహెచ్ సూపరింటెండెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రం 5 నుంచి 5.30గంటల వరకు పరీక్షించి.. జి.సూర్యనారాయణ, వి.సునీతదేవిలతో కూడిన వైద్యల బఅందం జైలు అధికారులకు నివేదిక అందజేసింది. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఐదు రకాల మందులను వైద్యులు సిఫార్సు చేశారు