Nov 13,2023 18:26

అనగనగా ఒక ఊరిలో ఎంతో చురుకైన అమ్మాయి ఉంది. తన పేరు సుచిత్ర. రోజూ లాగానే పాఠశాలకు తయారు అయ్యి ఇంటి బయటకు వచ్చింది. అప్పుడే తొలకరి చినుకులు మొదలయ్యాయి. అప్పటి వరకు వేసవి కారణంగా ఎంతో వేడి అయిన భూమికి ఒక్కసారిగా చల్లదనం లభించింది. మట్టి పరిమళం, సువాసన సుచిత్ర మనసును పులకరింపజేసింది. అలా ప్రకతిని ఆరాధిస్తూ వెళ్తున్న సుచిత్రకు ఎందుకో భూమాత దిగులుగా ఉండడం కనిపించింది. కారణం ఏమిటని అడిగింది. ఈ రోజు తన మట్టి యొక్క సువాసనను అందరూ ఆనందిస్తున్నారు. కాని ఆ మట్టి కలుషితం కాకుండా ఉండటానికి బాధ్యతను తీసుకోవడం లేదు. ఇలానే కొనసాగితే కొన్ని సంవత్సరాల తరువాత మట్టి తన విలువను కోల్పోతుంది. అప్పుడు భూమి పైన జీవనం కొనసాగించడం కష్టం అని చెప్పింది. ఈ మాటలు సుచిత్ర మనసును ఎంతో ప్రభావితం చేశాయి. మట్టిని కాపాడడం తన బాధ్యత అని భావించింది. ఇదే విషయం తన మిత్రులకు తెలిపింది. మట్టిని కాపాడడం కోసం తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.
నీతి : మట్టిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. మనం భూమిని తల్లిగా భావిస్తాం, మరి తమ తల్లని కాపాడుకోవడం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం.
రండి.. భూమిని రక్షిద్దాం. భావి తరాలకు నేలను స్వచ్ఛంగా అందిద్దాం.

k.v gowtami

కె. వి. గౌతమి
10వ తరగతి
ఎల్‌. ఆర్‌ జి విద్యాలయం
కిరికేరా హిందూపురం