ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది పేరుతో జనసేన, టిడిపి ఆధ్వర్యాన శనివారం సుంకరిపేట, దుప్పాడ, చిల్లపేట రోడ్లపై నిరసన తెలిపారు. మండలంలోని పలు గ్రామాల మధ్య ఉన్న అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. గోతులు పడ్డ రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించి అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. పాడైపోతున్న రోడ్లకు మరమ్మత్తులు చేయరా అంటూ పాలకులు, అధికారుల వైఖరిని తప్పుపట్టారు. ప్రమాదాలు జరిగితే కానీ స్పందించరా అంటూ ప్రశ్నించారు. వైసిపి పాలకులు కళ్లకు గంతలు కట్టుకున్నారని, వాళ్లకు రోడ్లపై పడిన గుంతలు కనిపించడం లేదని విమర్శించారు. జిల్లా లో పేరుకుపోయిన సమస్యలపై టిడిపి-జనసేన కలిసి ఉమ్మడి పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు. ప్రజావంచక ప్రభుత్వాన్ని సాగనంపుతామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కాటం అశ్వని, పి. లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, టి.రామకృష్ణ, రాజేష్, ఎల్ .రవితేజ తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి : మున్సిపాలిటీలో రోడ్ల దుస్థితిపై టిడిపి, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టిడిపి, జనసేన ఆధ్వర్యంలో పూల్‌బాగ్ రోడ్డుపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిరడ అప్పలస్వామి, టిడిపి పట్టణ అధ్యక్షులు రాంబార్కి శరత్, జనసేన నాయకులు ఎం.ధనంజరు, బి.దివ్య పాల్గొన్నారు.
గరివిడి : గర్భాం మార్గంలో అధ్వాన స్థితిలో ఉన్న రహదారిపై టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు విసినిగిరి శ్రీనివాసరావు, పైల బలరాం, వెన్నె సన్యాసినాయుడు, దన్నాన రామచంద్రుడు, సారేపాక సురేష్ బాబు, బలగం వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస : కొత్తవలస మండల కేంద్రంలో విజయనగరం వెళ్లే మెయిన్ రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఒబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యాన మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కెబిఎ రాంప్రసాద్, నాయకులు కరెడ్ల ఈశ్వరరావు, ఎల్లపు సూరిబాబు, కనకాల శివ, బంగారు రమేష్, బొబ్బిలి అప్పారావు, తిక్కాన చినదేముడు, లెంక శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం : మండలంలోని బమ్మిడిపేట వెళ్లే రహదారిలో టిడిపి, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కర్రోతు బంగార్రాజు, లోకం మాధవి ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు కర్రోతు సత్యనారాయణ, సువ్వాడ రవి శేఖర్, ఆకిరి ప్రసాద్, పతివాడ అప్పలనాయుడు, పల్లంట్ల జగదీష్, పళ్ళ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.