ప్రజాశక్తి- శృంగవరపుకోట : అంగన్వాడీలకు వేతనాల పెంపు, గ్రాడ్యుటి పెన్షన్ అమలు, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర యూనియన్ల పిలుపులో భాగంగా డిసెంబర్ 8 నుండి నిర్వహించే నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నామంటూ సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం పిఒ రమాకి సోమవారం సమ్మె నోటీసును అందిం చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయకు ండా నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కోసం డిసెంబర్ 8 నుండి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేయాలని సిఐటియు ఎఐటియుసి, ఐఎఫ్‌టియు అనుబంధ యూనియన్లు పిలుపుతో సమ్మెలో పాల్గొంటున్నట్లు సమ్మె నోటీసులు అందించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్లు యూనియన్ నాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గజపతినగరం: అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం గజపతినగరం ప్రాజెక్టు వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేసి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి లక్ష్మి, మాట్లాడుతూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర ఏళ్ల కాలంలో అనేక పోరాటాలు నిర్వహించారు కానీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ కంటే జీతం పెంచి ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, పెన్షన్‌తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్‌కు ఐదు లక్షలు, హెల్పర్ కు మూడు లక్షలు ఇవ్వాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు పిఒకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి పి జ్యోతి, అధ్యక్షులు ఎం సుభాషిని, సన్యాసమ్మ, నాగమణి, నారాయణమ్మ, సుజాత, రవణమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు.