Nov 19,2023 01:14

అమరావతి: బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అన్నారు . మండల కేంద్రమైన అమరావతిలోని ఎంపీడీవో కార్యాలయంలోని మీటింగ్‌ హాల్లో శనివారం బూత్‌ లెవెల్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమా వేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ ఎలక్షన్‌,ఎలక్ట్రో రూల్స్‌ క్లెయిమ్స్‌ పై 10 కంటే ఎక్కువ ఉన్న కుటుంబాల్లో ప్రత్యేక శ్రద్ధ తో సర్వే చేయాలని అన్నారు. చనిపోయినవారు ఉన్నట్లయితే నోటీస్‌ బి ఇచ్చి ఫారం 7 తో అప్డేట్‌ చేయాలని చెప్పారు. వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు ను కోరారు. ఎన్నికల నిర్వహణలో కొత్త ఓటర్ల చేరిక, యువతీ,యువకుల కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగ వంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనం తరం అమరావతి తహశీల్దార్‌ కార్యాలయాన్ని శ్యాం ప్రసాద్‌ తనిఖీ చేశారు. ప్రాధాన్యత క్రమంలోని ఐటమ్స్‌ ను సకాలంలో పూర్తి చేయాలని, ఫేజ్‌ 3 రీ సర్వే ఐటమ్స్‌ త్వరితగతన పూర్తి చేయాలని ఆదేశించారు. సమా వేశంలో అమరావతి ఎంపీడీవో ఉమాదేవి, తహాశీల్దార్‌ లు విజయశ్రీ, క్షమారాణి, జియా పాల్గొన్నారు.