ప్రజాశక్తి - వేపాడ : స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడంపై టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆదేశాలతో టిడిపి మహిళా సంఘాల అవగాహన ప్రధాన కార్యదర్శి, బానాది ఎంపిటిసి గొంప తులసి ఆధ్వర్యంలో గ్రామంలో సోమవారం సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. గరివిడి: చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ రావడం పట్ల టిడిపి నియోజకవర్గం ఇంఛార్జి కిమిడి నాగార్జున సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇది టిడిపి శ్రేణులకు పండగ రోజు అని చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు రౌతు కామునాయుడు, మహంతి అప్పలనాయుడు, ముల్లు రమణ, రౌతు నారాయణ రావు, గవిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బాడంగి : చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్బంగా రాష్ట్ర టిడిపి ఎస్టి సెల్ జనరల్ సెక్రటరీ, ఎంపిటిసి పాలవలస గౌరు ఎరుకుల పాకలు గ్రామంలో బాణా సంచ కాల్చి సంబరాలు చేశారు. శృంగవరపుకోట: ఎన్ని కేసులు పెట్టిన చంద్రబాబు మచ్చలేని నాయకుడిలా బయటకొస్తారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో సోమవారం పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలసి స్వీట్లు పంచిపెట్టి బాణాసంచ కాల్చి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో జామి, కొత్తవలస, వేపాడ టిడిపి మండల అధ్యక్షులు లగుడు రవికుమార్, గొరపల్లి రాము, గొంప వెంకటరావు, నాయకులు రాయవరపు చంద్రశేఖర్, గుమ్మడి భారతి, గొంప తులసి, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం కోట : మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆధ్వర్యాన టిడిపి నియోజకవర్గ కార్యాలయం వద్ద మిఠాయిలు పంచుకుని, సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో దాట్ల రవిరాజ్, మాజీ జెడ్పిటిసి తుంపిల్లి రమణ, భాను ప్రకాష్, కెల్ల సూరిబాబు, గొగుల రమేష్, చిప్పాడ స్వామి, మద్దిల ప్రవీణ్, గోగుల ప్రణయి, అంబళ్ళ సూర్యప్రకాష్ రావు, మీసాల సూరిబాబు పాల్గొన్నారు. స్థానిక అశోక్ బంగ్లా వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, టిడిపి పట్టణ అధ్యక్షులు పి.లక్ష్మీవరప్రసాద్, కార్యదర్శి బంగారు బాబు, మండల అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలి నాయుడు పాల్గొన్నారు.