Oct 01,2023 14:53
  • విలువైన భూమి ఐతే పేదలకు ఇవ్వకూడదా?
  • వైసిపి ప్రభుత్వం ఈ తరహలో పాలన చేయడం దారుణం..
  •  భూ స్వాదిన పోరాటంలో సిపిఎం నాయకుల విమర్శ

ప్రజాశక్తి-చిలమత్తూరు : ప్రభుత్వ భూమి అంటే పేదలకు సంబందించిన భూమి కదా? విలువైన భూమి అయితే పేదలు ఇంటి నిర్మణాలు చేసుకోవడానికి అర్హులు కాదా? ఇలాంటి అవగాహన ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా..? అని రైతు సంఘం అనంతపురం జిల్లా ప్రదాన కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి ఎల్ నరసింహులు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు బాబాజాన్, వ్యకాసం జిల్లా కార్యదర్శి పెద్దన్న అన్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరులో పేదలు భూస్వాధీన పోరాటం చేపట్టారు. స్థానికంగ ఉన్న రెవెన్యూ అదికారులు అవగాహాణ లోపంతో వారు చేసిన తప్పుకు పేదలు గత నాలుగేల్లుగా ఇళ్లు లేక బిక్కుబిక్కుమంటు గుడిసెలలో జీవించవల్సిన దుస్థితి నెల్కొందని అన్నారు‌. ప్రభుత్వం తరుపున రెవెన్యూ అదికారులు చూపిన భూమి ఏమో కోర్టు కేసులో ఉందని అక్కడ నిర్మాణం కుదరదని అంటున్నారని, మరి పేదలు ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణాలకోసం గుడిసెలు వేసుకుంటే విలువైన స్థలం కాబట్టి ఇవ్వలేమని అంటున్నారని, పోని విలువలేని భూమి అయిన పర్లేదు లేఅవుట్ వేసి పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణాలు చేసివ్వమంటే ఆ పని చేయలేకున్నారని ఇక పేదలు ఎక్కడ నివాసం ఉండాలో చెప్పాలని అన్నారు. భూస్వాదిన పోరాటంలో పాల్గొంటున్న నాయకత్వాన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసేందుకు కుట్ర చేస్తున్నారని అదే కనుక జరిగితే జిల్లా వ్యాప్త ఉధ్యమంగా మారుస్తామని హెచ్చరించారు. పేదలు న్యాయబద్దంగా శాంతియుతంగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవనం చేసుకుంటున్నారని వాటిని తొలిగించాలంటే ముందు ఇచ్చిన హామి ప్రకారం ఇంటి పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. త్వరలోనే నీటి సౌకర్యం కోసం చందాలు వేసుకొని బోరు వేసుకుంటామని స్పష్టం చేశారు. అరెస్టు చేయడం, భయబ్రాంతులకు గురుచేయడం మాని కనీస వసతులు కల్పించేందుకు అదికారులు కృషి చేయాలని సూచించారు. ఒకవేళ బలవంతంగా గుడిసెలు తొలిగిస్తే పేదలకు ఇళ్లు ఇచ్చేవరుకు ప్రభుత్వ కార్యాలయాలు ముందే  తిష్ట వేస్తామని స్పష్టం చేశారు. కార్యాయాలను మాకు నివాసాలుగా మారుస్తారో లేక శాంతియుతంగా గుడిసెలు వేసుకున్న చోట జీవనం చేసుకోమంటారో అధికారులు తేల్చుకోవాలని అన్నారు. ప్రభుత్వాలు పుట్టిన తర్వాత భూమి పుట్టలేదని, భూమి పుట్టిన తర్వతే ఈ ప్రభుత్వాలు  పుట్టాయని అయితే ఆ భూమిని పేదలు చేతికి ఇవ్వకుండా బడాబాబులు చేతికి అందించేందుకు ప్రభుత్వాలు పని చేస్తుంటాయని అన్నారు‌. దానిని కట్టడి చేస్తూ ఇది పేదలు భూమి అని గుర్తు చేసే పనిని కమ్యునిష్ట్ పార్టీలు చేస్తుంటాయని అన్నారు.పేదలకు సెంటు భూమిని ఇవ్వాలంటే కడుపు మండే ప్రభుత్వాలకు పెట్టుబడిదారులుకు మాత్రం వేళ్ల ఎకరాలు దారదత్తం చేయడానికి ఎర్రచివాతిలు వేస్తుంటాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో‌ వ్యకాసం జిల్లా కమిటి సభ్యులు గంగాధర్, సదాశివరెడ్డి, చందు, శివ, చరణ్, మణిస్వామి, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.