Oct 11,2023 17:20
  • కార్యాలయంలోకి దూసుకెళ్తున్న సిపిఎం నేతల అరెస్టు 
  • స్టేషన్లకు తరలింపు 

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఒకటవ నగర కమిటీ ఆధ్వర్యంలో  బుధవారం నగరపాలక కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవాలని బయలుదేరిన సిపిఎం నాయకులను, కార్యకర్తలను ,ప్రజలను భారీగా మోహరించిన  పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకున్నారు  మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ గేట్లను చూసికెళ్లి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించిన తోసికెళ్లి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన సిపిఎం నేతలు కార్యకర్తలు పోలీసులు అడ్డగించారు ఎక్కడికక్కడ కార్యకర్తలను వాహనాలలోకి తోసేసారు. అరెస్టు చేసిన వారిని పట్టణంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగినది . సిపిఎం ఒకటవ నగర కార్యదర్శి రామిరెడ్డిని ఇంటి వద్ద అరెస్టు చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించడం అదేవిధంగా నగరంలో ఉన్న రెండవ,  నాలుగు పోలీస్ స్టేషన్లో ఆందోళనకారులను నిర్బంధించి సొంత పూచి  మీద విడుదల చేయడం జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఒకటవ నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ నగర పాలకవర్గం సమస్యలను పరిష్కరించమంటె పోలీసుల ద్వారా అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు .రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు రాజ్యం నడుస్తుందని ఎవరు ఆందోళన చేసిన అరెస్టు  చేయడం పరిపాటైనదని విమర్శించారు‌. 10 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సిల్ సమావేశం 11:30 దాకా ప్రారంభం కాలేదు అంటే సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి  ఆందోళనే కారణమని తెలిపారు.పలు దపాలుగా నగరంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని  విన్నవించిన  ఫలితం లేనందువలన ఈ ముట్టడి చేయాల్సి వచ్చినదని తెలిపారు. టవర్ క్లాక్ దగ్గర ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ బందెల దొడ్డి కంటే అద్వానం గా ఉంటుందని ప్రజలంతా  ముక్కు మూసుకొని వెళుతున్న నగర పాలక వర్గానికి, అధికారులకు ఏమీ పట్టడం లేదని కోట్ల రూపాయల బాడుగలు వస్తున్న ఇక్కడ మాత్రం అభివృద్ధి జరగదని విమర్శించారు. వీరికి కమిషన్ల మీద ఉన్నంత వ్యామోహం అభివృద్ధి పట్ల లేదని తెలిపారు‌. టౌన్ ప్లానింగ్ లో కొందరు అధికారులను అడ్డం పెట్టుకొని కొందరు నాయకులు భవనాలు కడుతున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి ఏ విధంగా డబ్బు వసూలు చేస్తున్నది నగరంలో ఉన్న ఏ ఒక్కరిని అడిగినా తెలుస్తుందని తెలిపారు. అదే విధంగా నగరపాలక సంస్థలో నోరు ఉన్న వాళ్లకి , కొందరు కార్పొరేటర్లకి వాళ్ల డివిజన్లో పనులు జరుగుతున్నాయని వెనుకబడిన సామాజిక వర్గ కార్పొరేటర్ల డివిజన్లలో ఏమాత్రం అభివృద్ధి కనబడటం లేదని, కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో నోరు కొట్టుకుంటున్న స్పందించే నాయకుడే కరువయ్యాడని విమర్శించారు. ఈ క్రింది సమస్యలను పరిష్కరించమని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదని రాబోవు కాలంలో సిపిఎం పార్టీ ఈ సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నది హెచ్చరించారు.
 ప్రధానంగా అనంతపురం నగరం విస్తీర్ణంకు  అనుగునంగా కార్మికులు లేకపోవడం వల్ల చెత్త సేకరణ మరియు కాలువలు శుభ్రము చేయడం లేదు. వీటివల్ల ప్రజలు దోమల బారిన పడి మలేరియా, డెంగ్యూ లాంటి జబ్బులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున నగరం విస్తీర్ణం కనుగుణంగా కార్మికులను నియమించాలని కోరుచున్నాము. చెత్త పన్ను రద్దు చేయాలి, ఇంటి గుత్తలు తగ్గించాలి.  ప్రజలకు అసౌకర్యంగా ఉన్న   వీధి కుక్కలు, పందులు, పశువులను వెంటనే అనంతపురం నగరం నుండి తరలించాలి.
అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్న సెంట్రల్ పార్కును కాపాడి సుందరీకరణ చేయాలని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో  అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ పాలకవర్గం గానీ స్పందించడం లేదు. అనంతపురం నగరంలో పేద ప్రజలు ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం కేటాయించిన టిడ్కో ఇళ్లను కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదు. వెంటనే టిడ్కో ఇల్లను అర్హులైన వారికి ఇవ్వవలసినదిగా కోరుచున్నాము. పెండింగ్ లో ఉన్న నడిమి వంక సేఫ్టీ గోడలు నిర్మించాలి.  నడిమి వంక, పెద్ద వంక, మరువ వంక  పూడికతీత పనులు చేపట్టాలి. తిక్క రంగయ్య స్వామి గుడి నుండి తపోవనం పోవు దారిని బాగు చేయాలని, రిషిత స్కూల్ దగ్గర బ్రిడ్జిని నిర్మించాలని ఎన్నిసార్లు అధికారులకు ప్రజలు విన్నవించుకున్న ఏమాత్రం ఫలితం లేదు. కలెక్టర్ ఆఫీస్ నుండి చెరువు కట్టమీద పోవు దారిని బాగు చేయాలని, టౌన్ ప్లానింగ్ లో, రెవెన్యూ విభాగంలో అవినీతికి పాలు పడుతున్న అధికారులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నాము. ఈ ఆందోళనలో సిపిఎం పార్టీ నగర నాయకులు ప్రకాష్, వలీ, వెంకటనారాయణ, మసూదు, ముస్కీన్ ,రాజు బాలకృష్ణ ,ఎన్టీఆర్ సీన, గపూరు, ఎస్కే మహమ్మద్ ఆటో శివ, నాగరాజు, కుమార్,అమీర్ ,షర్మాస్,  షరీఫ్, లక్ష్మీదేవి పద్మావతి, వరలక్ష్మి, మాబున్ని ,షబానా ఫక్రుని తదితరులను అరెస్టు చేసి సొంత పూచీకత్తు మీద విడుదల చేయడం జరిగినది