Nov 19,2023 21:24

నెల్లిమర్ల : నిరసన తెలుపుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి - నెల్లిమర్ల : విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు మూడవరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిరాహార దీక్షకు మద్దతుగా ఆదివారం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్‌ రామకృష్ణ మాట్లాడుతూ గత మూడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలు కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద విద్యార్థులు చేస్తుంటే సమస్యలు పరిష్కారం చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సిగ్గు చేటని విమర్శించారు. సంక్షేమ హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదే సందర్భంలో సంక్షేమ హాస్టల్లో తగిన సిబ్బందిని నియమించాలని, ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని ఆపాలని, జూనియర్‌ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌ టీచర్‌ పోస్ట్లు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన విశ్వవిద్యాలయ పనులు వెంటనే ప్రారంభించాలని, నెల్లిమర్ల నియోజవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్లతో నిరాహార దీక్ష జరుగుతుందని తెలిపారు. ఒకవైపు దీక్ష చేస్తున్న బృందంలోని సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే జిల్లా విద్యాశాఖ అధికారులు కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ఎస్‌ఎఫ్‌ఐ చెప్తున్న డిమాండ్లను నెరవేర్చి విద్యార్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ప్రాణాలు పణంగా పెట్టైన్నా సరే తమ డిమాండ్లను నెరవేర్చుకుంటామని హెచ్చరించారు. దీక్షలకు మద్దతుగా ఈ నెల 21 మంగళవారం జరిగే కలెక్టరేట్‌ ముట్టడిలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ సమస్యలను వినిపించాలని కోరారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన తీవ్రతరం అవుతుందని, దానికి జిల్లా విద్యా శాఖ అధికారులు బాధ్యత వహించాలని చెప్పారు.
గజపతినగరం: విద్యారంగ సమస్యలపై జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలకు మద్దతుగా మండల కేంద్రంలో హాస్టల్‌ విద్యార్థులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు సోమేష్‌ మాట్లాడుతూ గత మూడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలు కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద విద్యార్థులు చేస్తుంటే సమస్యలు పరిష్కారం చేయాల్సిన అధికారులు నిమ్మ్కఉ నీరెత్తనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదే సందర్భంలో సంక్షేమ హాస్టల్లో తగిన సిబ్బందిని నిర్మించాలని, ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని ఆపాలని, జూనియర్‌ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌ టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని, గిరిజన విశ్వవిద్యాలయ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. దీక్షలకు మద్దతుగా ఈనెల 21 మంగళవారం జరిగే కలెక్టరేట్‌ ముట్టడిలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ సమస్యలను వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ హాస్టల్స్‌ విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.