ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని అక్కివరం, జొన్నాడ మధ్య రోడ్డులో ఆదివారం జనసేన, టిడిపి నాయకులు ఉమ్మడిగా 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది?' కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపై ర్యాలీగా వెళుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంతల్లో చేరిన నీటిలో పడవలు వదిలి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేన నియోజకవర్గ ఇంఛార్జిలు కర్రోతు బంగార్రాజు, లోకం మాధవి మాట్లాడుతూ నియోజకవర్గంలో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లపై ప్రయాణం నరకంగా ఉందన్నారు. వైసిపి ప్రజా ప్రతినిధులకు తెలిసేలాగా గుంతలు ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో సుమారు మూడు కిలోమీటర్ల పాటు నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపిలు కంది చంద్రశేఖర్, మహంతి చిన్నంనాయుడు, నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ టిడిపి అధ్యక్షులు కడగల ఆనంద్, కర్రోతు సత్యనారాయణ, పల్లె భాస్కరరావు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, నాయకులు, ఆకిరి ప్రసాద్, పోతల రాజప్పన్న, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
విజయనగరంకోట : స్థానిక జెఎన్‌టియు జంక్షన్ నుంచి కొండకరం రోడ్డు దుస్థితిపై టిడిపి, జనసేన ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఘంటా పోలినాయుడు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్విని, టిడిపి కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, కర్రోతు నర్సింగ్ రావు, కె.శ్రీనివాసరావు, రొంగలి రామారావు, జనసేన నాయకులు రౌతు సతీష్, మాజీ సర్పంచ్ పి.సూరప్పడు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్ : వైసిపి ప్రజాప్రతినిధులకు రోడ్ల దుస్థితి కనిపించకపోవడం సిగ్గుచేటని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. నగరంలో ఎస్‌బిటి మార్కెట్ జంక్షన్ , కంటోన్మెంట్ పోస్టాఫీస్ జంక్షన్, అయ్యన్నపేట జంక్షన్ రోడ్లపై జనసేన, టిడిపి ఆధ్వర్యాన నిరసన తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మురళీ శంకర్రావు, జనసేన నాయకులు కాటం అశ్విని, పితాల లక్ష్మి, దుప్పాడ జ్యోతి, టి.రామకృష్ణ, ఏంటి రాజేష్, ఎల్.రవితేజ, అభిలాష్, అడబాల వెంకటేష్, ఎం.పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంది సురేష్ కుమార్ పాల్గొన్నారు.