Nov 19,2023 22:46

ప్రజాశక్తి - తాళ్లపూడి మండలంలోని బల్లిపాడు ఇసుక ర్యాంపు నుంచి తరలిస్తున్న లారీల వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని టిడిపి యువగళం నాయకులు కాకర్ల సత్యేంద్ర అన్నారు. ఇసుక లారీల వల్ల కల్గుతున్న ఇబ్బందులపై ఆదివారం టిడిపి నాయకులు, కార్యకర్తలు రాంపు వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ ఇసుక లారీల కారణంగా ఏటిగట్టు రహదారితోపాటు బల్లిపాడుకు రెండువైపుల రహదారి లారీలతో నిండిపోయి ప్రజా రవాణాకు, అత్యవసర సర్వీసులకు ఆటంకంగా మారుతున్నాయిని అన్నారు. కార్తీకమాసం కారణంగా గోదావరి నదికి స్థానానికి వచ్చే మహిళలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇబ్బందులను ప్రశ్నిస్తున్న మహిళలపై ఇసుక మాఫియా సిబ్బంది వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.