ప్రజాశక్తి - నెల్లిమర్ల : జగన్‌కు మరోసారి సిఎంగా మద్దతు ప్రకటించాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు కోరారు. మంగళ వారం నగర పంచాయతీలో పద్మ శాలి వీధి 5వ సచివాలయం, డిజిటల్ బోర్డు ఏర్పాటు, ఏపికి జగన్ ఎందుకు కావాలి, మొయిద జంక్షన్ 2వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బైరెడ్డి సూర్య నారాయణ కల్యాణ మండపంలో జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి జగన్ మోహన్ రెడ్డికి సిఎంగా మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్ అధికారం చేపట్టి నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి అర్హులందరికీ సంక్షేమ పథకాల అందజేసారన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బంగారు సరోజినీ, శంకర రావు, వైస్ ఛైర్మన్‌లు సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు, పట్టణ వైసిపి అధ్యక్షులు చిక్కాల సాంబ శివరావు, కౌన్సిలర్లు మైపాడ ప్రసాద్, చిక్కాల సంతోష్, నాగ వశం కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిల వాసు, రహదారి భవనాలు కార్పొరేషన్ డైరెక్టర్ నౌపాడ శ్రీనివాస రావు, నాయకులు పాండ్రంకి సత్యనారాయణ, బూర సత్య నారాయణ, కమిషనర్ పి. బాలాజీ ప్రసాద్, మెప్మా సిఎంఎం డి. గోవింద రావు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి: మున్సిపాల్టీ పరిధిలోని 13వ సచివాలయంలో మంగళవారం ఎపికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు ఆధ్వర్యంలో చేపట్టారు. ముందుగా సచివాలయం పరిధిలో ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పొందిన సంక్షేమ పథకాలు లబ్ధిని వివరించే బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను తీసుకువచ్చేందుకు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని ప్రస్తుతం సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చోడగంజి రమేష్ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటి గోపాల్ రావు, వార్డు కౌన్సిలర్ మరిపి తిరుపతి రావు, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ సీతాదేవి,పాల్గొన్నారు.
బొండపల్లి: అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సంక్షేమ సారధి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరూ ఆశీర్వదించాలని ఎంపిపి చల్ల చలంనాయుడు కోరారు. మంగళవారం నెలివాడ గ్రామ పంచాయతీ ఆవరణంలో ఎంపిడిఒ వైవి.రాజేంద్ర ప్రసాద్ అద్యక్షతన ఎపికి జగనే ఎందుకు కావలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ పేదలు సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు సిఎం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు బొద్దల చిన్నం నాయుడు, పిఎసియస్ అద్యక్షులు మహంతి రమణ, నెలివాడ, బి.రాజేరు సర్పంచ్‌లు తాళ్ళపూడి కీర్తి, ఈదుబిల్లి కృష్ణ అధికారులు పాల్గొన్నారు. డెంకాడ: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపిపి బంటుపల్లి వెంకట్ వాసుదేవరావు అన్నారు. మండలంలోని గుణుపూర్ పేట లో మంగళవారం ఎపికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి జెండాను ఆవిష్కరించి ప్రభుత్వ పథకాలతో కూడిన సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి బడ్డుకొండ లక్ష్మి, వైస్ ఎంపిపి తమ్మునాయుడు, ఎంపిడిఒ డిడి స్వరూపరాణి, సర్పంచ్ పైల ముత్యాలరావు, రాము నాయుడు, కోరాడ కనకరాజు, అట్టాడ శివకృష్ణ, వైస్ సర్పంచ్ చిన్న పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేపాడ: సోంపురం గ్రామంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా సంక్షేమ బోర్డును ఎంపిపి సత్యవంతుడు మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సోంపురం గ్రామానికి ఇంతవరకు సంక్షేమ పథకాలు కింద రూ. 14 కోట్లు అందాయన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే మరల జగన్‌ను సిఎంను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, ఎఎంసి చైర్‌పర్సన్ ఎం. కస్తూరి, కో-ఆపరేటివ్ అధ్యక్షుడు రామ్మూర్తి నాయుడు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎన్ వెంకట్రావు, వైసిపి మండల అధ్యక్షులు జగ్గు బాబు, బిసి జిల్లా సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, సర్పంచ్ మురిపిండి గంగరాజు, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ సన్యాసినాయుడు, బుద్ధ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.