ప్రజాశక్తి-వేపాడ : కొండకు ఆనుకుని ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలో లబ్ధిదారులు ఎలా నివశిస్తారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం వేపాడ గ్రామానికి చెందిన 48 మందికి మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు. చాలామంది లబ్ధిదారులు పునాదుల వరకు నిర్మాణాలు చేపట్టి నిలిపివేయడాన్ని ఆయన గుర్తించారు. కొండకు ఆనుకొని ఇంటి స్థలాలు మంజూరు చేయడం, గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టడం లేదని ఆయన తెలిపారు. వాలంటీర్‌కు గ్రామంలో ఇల్లు ఉన్నా.. జగనన్న లేఅవుట్‌లో ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి భారతి, టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు. ఎస్.గణేష్, ముక్క రామకృష్ణ పాల్గొన్నారు
అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థికసాయం
నల్లబెల్లి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు రెడ్డి లక్ష్మి, గొర్లె గౌరికి రూ.5 వేలు చొప్పున టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ సాయం చేశారు. విగేశ్వర ఆలయానికి రూ.5వేలు అందించారు. అనంతరం గ్రామంలో సీనియర్ టిడిపి నాయకులు రండి ముసలి నాయుడు, బోజంకి మహేష్‌ను కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బి.నారాయణరావు, రంధి నరసింహం, ఎం.రామకృష్ణ, సిరికి రమణ, తదితరులు పాల్గొన్నారు.
గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్న గొంప కృష్ణ
మండలంలోని అరిగిపాలెంలో గౌరీ పరమేశ్వరుల విగ్రహాలను టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీకి రూ.5 వేలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు, తెలుగు యువత మండల అధ్యక్షులు ముక్క రామకృష్ణ పాల్గొన్నారు.