Nov 19,2023 22:39

ప్రజాశక్తి - ఉండ్రాజవరం గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమంలో భాగంగా ఆదివారం టిడిపి సీనియర్‌ నాయకులు కుందుల సత్యనారా యణ ఆధ్వర్యంలో సత్యవాడ నుంచి చివటం రోడ్లను, సత్యవాడ- రెడ్డి చెరువు మూడు కిలోమీటర్ల గుంతల రోడ్లను ప్రజలకి తెలియజేస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపికి ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టిన పేరు గుంతల ఆంధ్రప్రదేశ్‌ అని, అయితే కళ్ళకు గంతలు కట్టుకున్న వైసిపి పాలకులకు రోడ్లపై గుంతలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.గుంతలు పడిన రోడ్లపై అనేక ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది వికలాంగులుగా మారిపోయారని అన్నారు. అయినా వైసిపి పాలకులకు కనికరం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులు చేయని వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన ఉపాధ్యక్షులు గరిమెళ్ళ కొండలరావు, టిడిపి, జనసేన నాయకులు వాకలపూడి వెంకటరత్నం, అంబటి వెంకటరమణ, మద్దుకూరి రాధా, మల్లుల వీరబాబు, కరుటూరి లీలా కుమార్‌, దుర్గా రమేష్‌, అరిగెల నాగ సత్తిరాజు, తదితరులు పాల్గొన్నారు.