ప్రజాశక్తి- గంట్యాడ : పుస్తక పఠనుం వల్ల పరిజ్ఞానం పెరుగుతుందని గంట్యాడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఝాన్సీ అన్నారు. శాఖ గ్రంథాలయాధికారి బి రామభద్రరాజు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు ఆమె చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కెజిబివి ప్రత్యేకాధికారి అల్లు జ్యోతి, గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గంగాధరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. లక్కవరపుకోట : మండల కేంద్రంలో ఉన్న శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 56వ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారంతో ముగిసాయి. ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్యారమ్స్, వ్యాసరచన, డిబేట్, క్విజ్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఎంఇఒ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లైబ్రరియన్ బి మేరీనిర్మల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పతివాడ సతీష్, కే సునీత, మహేష్, రాజుతోపాటు కస్తూరిభా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. రేగిడి: పుస్తక పఠనంతో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఎంపిడిఒ శ్యామల కుమారి అన్నారు. సోమవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో 56వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల క్రీడ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కార్యాలయ సూపరింటెండెంట్ డి.నాగమణి, ఇఒపిఆర్‌డి సత్యనారాయణ, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు వి.సూర్యనారాయణ, జి రామ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. డెంకాడ: గ్రంథాలయాల్లో చదువుకుని చాలామంది ఉన్నత శిఖరాల అధిరోహించారని మరి కొంతమంది కాంపిటీషన్ పరీక్షల్లో ఉత్తీర్ణతలు సాధించారని పిఎసిఎస్ చైర్మన్ రొంగలి కనక సింహాచలం తెలిపారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనక సింహాచలం తన భార్య సత్యవతి పేరు మీద రూ.3వేలు విలువైన బహుమతులను గెలుపొందిన విద్యార్థులకు అందజేశారు. బాగా చదువుకునే విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథాలయానికి అందజేస్తానని చెప్పారు. అనంతరం వారోత్సవాల్లో భాగంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పతివాడ గౌరీ, లైబ్రేరియన్ వై మహేష్, రిటైర్డ్ లైబ్రేరియన్ డి దేవుడు, జిల్లా పరిషత్ పాఠశాల సోషల్ టీచర్ కెవి సుధాకర్, నాయకులు రొంగలి గోపాలకృష్ణ, శ్రీ సత్య స్మార్ట్ స్కూల్ సిబ్బంది, వశిష్ట స్కూల్ సిబ్బంది, పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: జరజాపుపేట గ్రామీణ గ్రంథాలయంలో నిర్వహాకురాలు జె. నారాయణమ్మ అధ్యక్షతన 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారం ముగిశాయి. నగర పంచాయతీ వైస్ చైర్మన్ సముద్రపు రామారావు పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయాలు మానవ జీవన మనుగడకి విద్యాలయాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా గ్రంధాలయ సేవా సంఘం ఉపాధ్యక్షులు కడలి ప్రకాశరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సుంకరి వాసుదేవరావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ మద్ధిల వాసు, నాయకులు పాండ్రకి సత్యనారాయణ, తుమ్ము నారాయణమూర్తి, నల్లి శ్రీనివాసరావు, నల్లి శివ, ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో 53వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారం ముగిశాయి. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి, అందులో గెలుపొందిన వారికి చైర్ పర్సన్ బంగారు సరోజిని చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రంథాలయాధికారి, గ్రంధాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శృంగవరపుకోట: పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో గతవారం రోజులుగా నిర్వహిస్తున్న 56వ జాతీయ గ్రంథాల వారోత్సవాలు సోమవారం ముగిశాయి. సర్పంచ్ గనివాడ సంతోష్ కుమారి, ఎంపిపి సండి సోమేశ్వరరావు, జెడ్‌పిటిసి ఎం వెంకటలక్ష్మి హాజరై వారోత్సవాల్లో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. గ్రంథాలయంలో చదువుకుంటూ ఆర్‌ఆర్‌బిలో ఉద్యోగం పొందిన పట్టణానికి చెందిన మోపాడ మోహన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ- 2 పాదం గణేష్ లక్ష్మి, ఉపాధ్యాయులు వి. మల్లేశ్వరి, ఎస్. శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పూసపాటిరేగ: గ్రంథాలయాలు విజ్ణాన నిలయాలని జెడ్‌పిటిసి మహంతి సీతాలక్ష్మి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయం ముగింపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలిపొందిన విద్యార్ధులకు బహుమతులును ప్రధానం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాలు నేటి తరానికి దిక్చూచిగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టొంపల సీతారాం, హైస్కూల్ హెచ్‌ఎం బి. శంకరావు, పెద్దలు పివిఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. తెర్లాం: స్థానిక శాఖ గ్రంథాలయాధికారి సిహెచ్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ముంగిపు కార్యక్రమలో ఎంఇఒ జె. త్రినాధరావు, స్థానిక ఎస్‌ఐ ఆర్ రమేష్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఇఒ ఎం సత్యనారాయణ, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్ ఎస్. రమేష్, క్రాఫ్ట్ టీచర్ విస్సు, వెంకటేశ్వర కాలేజీ ప్రిన్సిపాల్ సిహెచ్ తిరుపతిరావు, టి రామారావు, అంగన్వాడి టీచర్ వై శ్రీదేవి, పిఇటిబి నారాయణ నాయుడు పాల్గొన్నారు.