ప్రజాశక్తి - యంత్రాంగం పలుచోట్ల టిడిపి ఆధ్వర్యాన శుక్రవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు చేపట్టారు. కాకినాడ రూరల్ అరాచకపాలన సాగిస్తున్న వైసిపికి రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని కాకినాడ రూరల్ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మీ సత్తిబాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ప్రభాకర్, కుడిపూడి సత్తిబాబు, జనసేన రాష్ట్ర కార్యదర్శి పొలసపల్లి సరోజ, సలాది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వలసపాకలలో నిర్వహించిన కార్యక్రమంలో కర్రి వెంకటరాజు, తాతపూడి రామకృష్ణ, మిరపల సూర్యప్రకాష్, పి.త్రిమూర్తులు, బాదం వరలక్ష్మి, కొల్లుబోయిన అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. యు.కొత్తపల్లి రాష్ట్రంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసిపి విఫలమైందని పిఠాపురం మాజీ ఎంఎల్‌ఎ, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌విఎస్‌ఎన్.వర్మ అన్నారు. ఉప్పాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి కృష్ణారెడ్డి, చోడిపల్లి ప్రసాద్ పాల్గొన్నారు. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ, జనసేన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత పెద్దాపురంలో ఎంఎల్‌ఎ చినరాజప్ప మాట్లాడారు. జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి పాల్గొన్నారు.