Nov 18,2023 22:37

ప్రజాశక్తి - సీతానగరం గడప గడ పకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుం చి ప్రతీ సమస్యను పరిష్క రించేందుకు చర్యలు తీసు కుంటున్నామని ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు. శనివారం ఇనగంటివారిపేట గ్రామంలో సచివాలయం, ఆర్‌బికె, హెల్త్‌ క్లీనిక్ల భవనాలను ఆయన ప్రారంభించారు. అలాగే ముగ్గళ్ళ గ్రామంలో 215 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో సుమారు రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. మరో రూ.1000 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపారు. సీతానగరం నాలుగు లైన్ల రోడ్ల పనులు, తొర్రిగడ్డ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, రఘుదేవపురంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుర్రాల జ్యోస్నా, జడ్‌పిటిసి చల్లమళ్ళ వెంకటలక్ష్మి, వైసిపి నాయకులు కరుటూరి హరిబాబు, సురేష్‌ రాజు, మదన్‌ బాబు, సుంకవల్లి సుబ్రహ్మణ్యం, సర్పంచ్‌ సత్యం రాంపండు, మద్దాల కొండలరావు, కొండ్రపు ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.