Nov 20,2023 20:45

భోగాపురం: డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బడ్డుకొండ

ప్రజాశక్తి- భోగాపురం : పేదలకోసం ప్రవేశపెట్టిన పథకాలే జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపిస్తాయని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని బైరెడ్డిపాలెం పంచాయతీలో గడపగడపకు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ బైరెడ్డి రాజు, జేసిఎస్‌ కన్వినర్‌ యర్రప్పలనారాయణరెడ్డి, మాజీ జెడ్‌పిటిసి ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైసిసి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి గడగడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి వివరించారు. అనంతరం ఇదే సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పథకాలను తెలిపే డిస్‌ప్లే బోర్డును ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కొయ్య సంతోషి, నాయకులు పడాల శ్రీనివాసరావు, భాను, కొల్లి రామ్మూర్తి, సుందర హరీష్‌, లక్ష్మణ్‌, ఎంపిడిఒ అప్పలనాయుడు, తహశీల్దారు బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.
బొండపల్లి : పేద ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం ఆలోచించేది ఒక్క జగన్మోహన్‌ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. సోమవారం మండలంలోని గొట్లాం సచివాలయ ఆవరణంలో ఎంపిపి చల్ల చలంనాయుడు అద్యక్షతన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి జగనే ఎందుకు కావలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ పేదల ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకం అందిచాలానే ద్వేయంతో జగన్మోహన్‌ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఉద్యోగాలను అమ్ముకున్నారని అప్పలనరసయ్య ఆరోపించారు. అభివృద్ధి పేరిట దోచుకొని దాచుకున్నారని విమర్శించారు. అనంతరం వైసిపి జెండాను ఎగురు వేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి రాపాక సూర్య ప్రకాశ రావు, వైసిపి మండల అధ్యక్షులు బొద్దల చిన్నం నాయుడు, పిఎసియస్‌ అద్యక్షులు మహంతి రమణ, సీనియర్‌ వైసిపి నాయకులు మీసాల తులసీరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేపాడ: మండలంలోని డిఆర్‌పేటలో ఎపికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎంపిపి డి. సత్యవంతుడు పాల్గొని మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వమూ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందజేయలేదని, గ్రామ వాలంటరీ వ్యవస్థను పెట్టి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తున్నామన్నారు. అనంతరం సంక్షేమ పథకాలు బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎన్‌ వెంకట్రావు, గ్రామ సర్పంచ్‌ దండుపాటి ముత్యాలమ్మ, ఎంపిటిసి శామంతుల లక్ష్మి, వైసిపి మండల అధ్యక్షుడు ఎం జగ్గు బాబు తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం: సంక్షేమం, అభివృద్ధి వైసిపితోనే సాధ్యమని జెడ్‌పిటిసి గార తవుడు అన్నారు. సోమవారం ఎపికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని కాలంరాజుపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బెల్లాన జ్ఞాన దీపిక, సర్పంచ్‌ గేదెల ఈశ్వరరావు, కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల: మండంలోని కొండగుంపాం సచివాలయంలో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల డిజిటల్‌ బోర్డును ఎంపిపి అంబళ్ళ సుధారాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, వైస్‌ ఎంపిపి పి. సత్యన్నారాయణ, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములు నాయుడు, సర్పంచ్‌ పతి వాడ అప్పన్న, ఎంపిడిఒ జి. రామారావు, ఇఒపిఆర్‌డి కె. సింహాద్రి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు