- దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి-మార్కాపురం : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే ఆర్టీసీ డ్రైవర్ల పై దాడికి పాల్పడడం హేయమైన చర్యని ఆర్టీసీ డ్రైవర్ సంఘ నాయకులు ద్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై చేసిన దాడిని ఖండిస్తూ మార్కాపురం ఆర్టీసీ డిపో నందు జేఏసీ, ఎన్ ఎం యూ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేసే ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేయడం సరైన పద్ధతి కాదని ధ్వజమెత్తారు. ఆర్టీసీ డ్రైవర్ల పై దాడికి దిగితే సహించేది లేదని, కావలిలో రాజాసింగ్ పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రాజాసింగ్ పై జరిగినటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చి డ్రైవర్లకు భరోసా కల్పించాలని కోరారు. ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం అయితే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని వారు హెచ్చరించారు. రాజాసింగ్ పై దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించి రాజా సింగ్ కు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నా నందు డిపో అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఎన్ఎంఈ కార్యదర్శి కాశయ్య, జోనల్ సహాయ కార్యదర్శి శాస్త్రి, రీజినల్ నాయకులు భాషా హుస్సేన్, ఎన్ఎంయు నాయకులు SN భాష, SK హుస్సేన్, పాలంకయ్య, హుస్సేన్, శిక్షావలి, వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.