ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే రాబోయే రోజుల్లో సమ్మె చేయడానికి కూడా వెనుకాడ బోమని సమగ్ర శిక్ష పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్స్ రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్ యన్ దేవేంద్ర రావు స్పష్టం చేశారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఉద్యోగులు రౌండ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేంద్ర రావు మాట్లాడుతూ సమస్యల పరిష్కరించమని అర్జీలు ఇస్తుంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సెప్టెంబర్ , అక్టోబర్ నెలల నుండి వేతనాలు చెల్లించటం లేదన్నారు. ఈ విధమైన విధానాలు ప్రభుత్వం మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో సమ్మె చేయడానికి కూడా వెనుకాడబొమని స్పష్టం చేశారు.వేతనాలు పెంపుదల అలాగే రెగ్యులర్ గురించి అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని ,కానీ ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరించకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు.ఈ సమావేశంలో పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్ అంకాని శేషుబాబు , ఐ ఆర్ టి నాయకులు యస్ సురేష్ బాబు, సి ఆర్ పి నాయకులు ఏ డి యన్ కిషోర్ , కె రామకష్ణ , పడమటి నాగరాజు , సి హెచ్ వీర్లంకమ్మ , మహ్మద్ యూనస్ బేగ్, కంప్యూర్ ఆపరేటర్ నాయకులు లేళ్ళ రాజేష్ బాబు పాల్గొన్నారు.