ప్రజాశక్తి - పెరవలి టిడిపి, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమం పేరుతో పాదయాత్ర జరిగింది. మండలంలోని కానూరు నుంచి ఉసులుమర్రు వరకూ టిడిపి సీనియర్ నాయకులు కుందులు వీర వెంకట సత్యనారాయణ, జనసేన జిల్లా కార్యదర్శి తులా చినబాబు ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంతల ఆంధ్రప్రదేశ్‌గా పిలుస్తున్నారని, అయినా రాష్ట్ర పాలకులకు సిగ్గు అన్పించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వాకలపూడి వెంకటరత్నం, అంబటి వెంకటరమణ, మద్దుకూరి రాధా, జనసేన నాయకులు మొహమాటి చక్రధర్, పల్లాలు, హనుమంతు, శివ పాల్గొన్నారు.