ప్రజాశక్తి - కడియం మండలంలోని మురమండ గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బబూ అండ్ షమ్మీ వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం ప్రారంభం అయ్యింది. ఈ పోటీలను వైసిపి మండల అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బబ్లూ షమ్మీ లకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే బబ్లూ షమ్మీ దివంగతులవటం చాలా బాధాకరం అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువకులు విరివిగా నిర్వహించాలని, వ్యయప్రయాసలతో కూడుకున్న ఇటువంటి క్రీడలు ద్వారా సమాజానికి మంచి సందేశంతోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని అన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ టోర్నమెంట్ లో వివిధ గ్రామాల నుంచి 24 టీమ్‌లు పాల్గొనగా రాజమహేంద్రవరం టీము విన్నర్‌గా నిలిచింది. విన్నర్ టీమ్‌కు రూ.20 వేలు నగదు బహుమతిని అందించారు. రన్నర్ టీమ్‌గా ప్రత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం జట్టు నిలిచింది. ఈ టీమ్‌కు రూ.10 వేలు నగదు బహుమతిని అందించారు. ఆర్ధికంగా సహకరించిన రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్‌కు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయినవల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు, ఎంపిటిసి మెల్లిమి మంగా గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.