ప్రజాశక్తి-కాకినాడ
వైసిపి ప్రభుత్వ పాలనలో ఆంధ్ర రాష్ట్రం గుంతల రాష్ట్రంగా తయారైందని, రాష్ట్రము, కాకినాడ నగరంలోని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, జనసేన పోలిట్ బ్యూరో సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై టిడిపి, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గం లో శనివారం ఇరు పార్టీ నాయకులు కెనాల్ రోడ్, పోర్ట్ రోడ్, డంపింగ్ యార్డ్ రోడ్లను పరిశీలించి ఓల్డ్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పోర్ట్ రోడ్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏలేశ్వరం మండలంలోని లింగంపర్తి, తిరుమాలి గ్రామాల్లో టిడిపి, జనసేన సారథ్యంలో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది పేరిట నిరసన చేపట్టారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరుపుల సత్యప్రభ, జనసేన ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబు మాట్లాడారు.అనంతరం తిరుమాలి రోడ్డులో పాదయాత్ర నిర్వహించారు.