భవ్యశ్రీ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి : టిఎన్ఎస్ఎఫ్
ప్రజాశక్తి-జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జి.మాడుగుల మండల కేంద్రంలో టి.ఎన్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో అరకు పార్లమెంట్ తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య (టి.ఎన్.ఎస్.ఎఫ్) ప్రధాన కార్యదర్శి వనుగు త్రినాధ్ పాల్గొని మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఠాణా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ మృతి చెంది వారం రోజులు అవుతున్న హత్యకు కారకులైన వారిని శిక్షించ లేదన్నారు. హత్యకు పాల్పడ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి లకే.రామకృష్ణ, పాడేరు నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి సోమ్మెలి రామరాజు, టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.