ప్రజాశక్తి-కూనవరం : మండలంలోని బీమవరం గ్రామంలోని ఐసి.డి.ఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు.ఈ సందర్బంగా సీఐటీయూ మండల కార్యదర్శి కొమరం పెంటయ్య మాట్లాడుతూ తెలంగాణ కన్న అదనంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలోని అంగన్వాడీలందరికి సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యువిటీ ఇవ్వాలని కోరారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5లక్షలు ఇవ్వాలని, అనంతరం సగం జీతం ఇవ్వాలని డిమాండ్ చేసారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటరలుగా మార్చాలని అన్నారు. ఆర్. ఎఫ్. ఎస్ రద్దు చేయాలని, అని యాప్ లు కలిపి ఒకే యాప్ గా మార్చాలని డిమాండ్ చేసారు. పెండింగ్ లో ఉన్న అద్దె బిల్లులను, టీ. ఏ బిల్లులు ఇతర బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు తాళ్లూరి శశ్రీనివాసరావు, ప్రాజెక్ట్ అధ్యక్షులు ప్రసన్న, కార్యదర్శి అన్నపూర్ణ, లలిత, అర్జమ్మ, రాణి, వరలక్ష్మి ముత్తమ్మ, అరుణ, సీపీఎం నాయకులు బాబురావు తదితరులు పాల్గొన్నారు.