Sep 06,2023 12:28

రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : సిపిఎం సమరభేరిలో భాగంగా బుధవారం ఆ పార్టీ రెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో రెడ్డిగూడెం మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన, రాస్తారోకో, బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్‌ నాయకులు మద్ది రెడ్డి మాధవరెడ్డి మాట్లాడుతూ ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ దేశ, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ వస్తున్నాయని తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకం నిధులు పెంచాలని, 400 రూపాయలకే గ్యాస్‌ ఇవ్వాలని, సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జంగా వెంకటరెడ్డి, ఉయ్యూరు కఅష్ణారెడ్డి, చాట్ల విజయకుమార్‌, గద్దల ఇశ్రాయేలు, అప్పిరెడ్డి, గోపయ్య, తదితరులు పాల్గొన్నారు.