Sep 26,2023 20:34

ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : చింతపల్లి మండలం అన్నవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ. మూడు కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి చింతపల్లి ఎఎస్‌పి ప్రతాప్‌ శివ కిషోర్‌ తెలిపి వివరాల ప్రకారం.. వెల్లడించారు. నిమ్మపాడు గ్రామ శివారులో మంగళవారం వేకువ జామున గుట్టుచప్పుడు కాకుండా వాహనంలో తరలుతున్న 1400 కిలోల గంజాయిని పట్టుకున్నారు. చింతపల్లి మండలం రాళ్లగడ్డ గ్రామస్తుడు సిందేరి చిన్నయ్య, భీమసింగి గ్రామస్తుడు ప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.లక్ష నగదు, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేశారు. గంజాయిని పట్టుకున్న పోలీసు బృందాన్ని ఎఎస్‌పి అభినందించారు.